ప్రమాదవశాత్తు బావిలో పడి వార్డు మెంబర్ మృతి..

ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన చెన్నారావుపేట మండలంలోని సూర్యాపేట తండాలో జరిగింది.

Update: 2023-04-10 09:20 GMT

దిశ, నర్సంపేట: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన చెన్నారావుపేట మండలంలోని సూర్యాపేట తండాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తండాకి చెందిన దరావత్ మైబు (43) వార్డ్ మెంబర్, సోమవారం ఉదయం పొలం వద్దకు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లాడు. వేప పుల్ల కోసం బావి దగ్గరికి వెళ్లడంతో ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు సమాచారం. ఈ క్రమంలో బావిలోనే మైబు మృతి చెందాడు. మృతునికి భార్య సుజాత, కొడుకు, కూతురు ఉన్నట్లు తెలిసింది. మైబు మృతితో సూర్యాపేట తండాలో విషాదచాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News