సోనియాను కలిసిన వరంగల్ రిజిస్ట్రార్.. ఎంపీగా అవకాశమివ్వాలని అభ్యర్థన
కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు
దిశ,వరంగల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు అవకాశమివ్వాలని వరంగల్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కోరారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న ఆయన ఇటీవల ముమ్మరం చేశారు. అందులో భాగంగానే బుధవారం మధ్యాహ్నం పార్లమెంటులో సోనియగాంధీని కలిశారు. సోనియాను శాలువతో సన్మానించి... జ్ఞాపికను అందజేశారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని సోనియాను అభ్యర్థించారు.
ఈమేరకు సోనియాగాంధీ నుంచి సానుకూలంగా స్పందించారు. ఐ విల్ ట్రై మై లెవల్ బెస్ట్ అంటూ బదులిచ్చినట్లు సమాచారం. వరంగల్ పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల పరిశీలనలో మొదట్నుంచి హరికోట్ల రవి పేరు ప్రముఖంగా వినబడుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రవి ఎంపికకు సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తుండగా, తాజాగా రవి పార్టీ అగ్రనేతలను కలుస్తుండటం గమనార్హం. హరికోట్లకే ఎంపీ టికెట్ వస్తుందనే ధీమాలో ఆయన సన్నిహితులు ఉండగా, ఇప్పటికే ఆ దిశగా ఏర్పాట్లకు సన్నద్ధమవుతుండటం గమనార్హం.