Warangal Collectorate : ‘ప్రభుత్వం మాకు ఇచ్చిన భూమిని రక్షించండి’

మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన దళితులు మా

Update: 2024-07-22 08:45 GMT

దిశ,పర్వతగిరి: మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన దళితులు మా భూమిని రక్షించాలని స్థానిక ఎమ్మార్వో కు దరఖాస్తు చేసుకున్నారు. గత నలబై సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం సర్వే నెంబర్ 39, 184 లోని సుమారు 30 ఎకరాల ప్రభుత్వ పంచ రాయి పూర్తి భూమిని తమకు కేటాయించిందని, పట్టాలు కూడా ఇచ్చారని అన్నారు. అప్పటినుండి తామే సాగు చేసుకుంటున్నామని, ఇప్పటివరకు ఎవరికీ అమ్మకం చేయలేదు, కానీ ఎలాంటి సరి హద్దులు లేవని అన్నారు. అయితే ఈ భూమిని కొందరు వ్యక్తులు నకిలీ పట్టాలు సృష్టించి అమ్మదలుచుకున్నారని, వారి నుంచి మాకు రక్షణ కల్పించాలని స్థానిక ఎమ్మార్వో కు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ 39,184 సర్వే భూమిని ఎవరు అమ్మకుండా ఎవరు కొనకుండా మా భూమిని రక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో దాసరి సారయ్య చిన్నపాక వెంకటయ్య, దాసరి రాములు, గిద్ద సారయ్య, యాసారపు సురేష్, దాసరి రాజు, రాపాక కిషన్, బుర్కి రవికుమార్, బుర్కి ఉప్పలయ్య, బుర్కి వెంకన్న,పసుల శ్రీనివాస్, తక్కలపల్లి రాజు, జిల్లా కుమారస్వామి,తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News