అక్రమ కేసులు బనాయించి.. ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారు : గంట రవి కుమార్

ప్రశ్నించే గొంతులను నొక్కాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పదోతరగతి ప్రశ్నా పత్రం లీక్ చేశారంటూ అక్రమ కేసు బాణాయించారని వరంగల్ తూర్పు బీజేపీ నేత గంట రవి కుమార్ ప్రభుత్వం పై మండి పడ్డారు.

Update: 2023-04-07 10:23 GMT

దిశ, ఖిలా వరంగల్ : ప్రశ్నించే గొంతులను నొక్కాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పదోతరగతి ప్రశ్నా పత్రం లీక్ చేశారంటూ అక్రమ కేసు బాణాయించారని వరంగల్ తూర్పు బీజేపీ నేత గంట రవి కుమార్ ప్రభుత్వం పై మండి పడ్డారు. బండి సంజయ్ కు బెయిల్ మంజూరు అయి బయటికి వస్తున్న సందర్భంగా సంజయ్ ని శుక్రవారం కరీంనగర్ లో కలిశారు. ఈ మేరకు రవికుమార్ మాట్లాడుతూ కేసీఆర్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, అక్రమాలు ఎండగడుతూ, నిరుద్యోగుల పక్షాన, ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ఓర్వలేకనే సంజయ్ పై అక్రమ కేసులు మోపారని ఆరోపించారు.

ఆయనకు కేసులు కొత్త కాదని ప్రజాపక్షాన పోరాడటమే ఆయన నైజం అని వెల్లడించారు. సంజయ్ కు బెయిల్ రావడం ప్రజాస్వామ్య విజయమని రవి కుమార్ అభివర్ణించారు. అధికార బలంతో ఏదైనా సాధించవచ్చు అని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోందని కానీ బీజేపీ ప్రజా బలమే తమ బలంగా భావిస్తోందని అన్నారు. అన్నీ ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో బీఅర్ఎస్ కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన పోయి బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పాలన వస్తుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News