Trending: కామారెడ్డిగూడెంలో అద్భుతం.. వేపచెట్టు నుంచి వస్తున్న నీటి ప్రవాహం
వేపచెట్టు మొదలు నుంచి నీరు ఉబికి వస్తున్న అద్భుత ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది.
దిశ, దేవరుప్పుల: వేపచెట్టు మొదలు నుంచి నీరు ఉబికి వస్తున్న అద్భుత ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు.. 150 ఏళ్ల క్రితం నాటిన (గిర్ధవార్) వేప చెట్టు వర్షాల కారణంగా శుక్రవారం నేలకొరిగింది. అయితే, స్థానికులు దానిని తొలగించేందుకు మిషన్తో ఓ కొమ్మను కోసివేయగా అందులోంచి నీరా మాదిరిగా నీరు ఒక్కసారిగా ప్రవహించడం మొదలు పెట్టాయి. అయితే, ఈ చిత్రం చూసిన గ్రామస్తులు మాత్రం చెట్టు నుంచి నీరు రావడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.