Commissioner : ఐవిఎన్ఎం పనుల్లో వేగం పెంచండి

ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ (ఐవిఎన్ఏం) నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు.

Update: 2024-10-26 15:28 GMT

దిశ, వరంగల్ టౌన్: ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ (ఐవిఎన్ఏం) నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శనివారం వరంగల్ లక్ష్మీపురం లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మిత ప్లాన్ ను పరిశీలించారు. పనులు పూర్తి కావడానికి ఎంత సమయం ఉందో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్, ఎనుమాముల మార్కెట్ కార్యదర్శి నిర్మల, ఈఈ శ్రీనివాస్, డిఈ రాజ్ కుమార్, పండ్ల వ్యాపారుల సంఘం అధ్యక్షులు వెల్డి సాంబయ్య, ప్రధాన కార్యదర్శి చెన్నమల్లు, కోశాధికారి వెల్ది సతీష్, తదితరులు పాల్గొన్నారు.


Similar News