MLA Kadiam Srihari : పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు

Update: 2024-10-26 13:53 GMT

దిశ, జనగామ:: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మరానని అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ… పార్టీ మారిన వారందరూ రాజకీయ వ్యభిచారులని కేటీఆర్ మాట్లాడడం సరైంది కాదని గతంలో కేసీఆర్ కూడా పార్టీలు మారారని గుర్తుంచుకోవాలని అన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని లేనిచో ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన వారిని కేటీఆర్ రాజకీయ వ్యభిచారం అనడం సిగ్గుచేటని అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చిన తర్వాత ఎందరో పార్టీ మారారని తెలిపారు.

ఇప్పటికా పార్టీ ఫిరాయింపులపై కోర్టు తీర్పులకు కట్టుబడి ఉంటామన్నారు. కేటీఆర్ అహంకార, బలుపు వ్యాఖ్యలు సహించేది లేదని హెచ్చరించారు. కేటీఆర్ నీతిమంతుడు, నిజాయితీపరుడైతే 2014 ముందు నీ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆస్తులు ఎంతో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గురివింద గింజ కింద నలుపు ఎరుగది అన్నట్లు కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 2014 లో పార్టీ మారిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, 2018 లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు తెర లేపిందే బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు.

నీ అయ్య కేసీఆర్ పార్టీలు మారిండు కేసీఆర్ రాజకీయ వ్యభిచారేనా అని అన్నారు. మీరు చర్చ సంసారం మేం చేస్తే వ్యభిచారమా అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ దూదిపాల నరేందర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, గడ్డమీది సురేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింత కుంట్ల నరేందర్ రెడ్డి, బెలిదే వెంకన్న, పొట్లపల్లి శ్రీధర్ రావు, భూర్ల శంకర్, పోగుల సారంగపాణి, కోతి రాములు గౌడ్, రాపోలు మధుసూదన్ రెడ్డి, రంజిత్ రెడ్డి, నాగరబోయిన శ్రీరాములు, నీల గట్టయ్య, బాల రాజు, తెల్లాకుల రామకృష్ణ, ఆరేళ్లి అశోక్ గౌడ్, తోట సత్యం, స్వామి నాయక్,గుర్రం పాతి కుమార్, గుర్రం రాజు, నీల సోమన్న, కొర్ర వెంకటేష్, నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Similar News