చోరీ కేసులో నిందుతుల అరెస్ట్, రిమాండ్ కు తరలింపు

దొంగతనం కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు దుగ్గొండి సీఐ సాయి రమణ తెలిపారు.

Update: 2024-11-23 11:55 GMT

దిశ, దుగ్గొండి: దొంగతనం కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు దుగ్గొండి సీఐ సాయి రమణ తెలిపారు. ఈ నెల 14 వ తేదీన గిర్నిబావి లో జరిగిన మహిళ ఆభరణాల దొంగతనం కేసులో ఆరుగురిని పట్టుకున్నట్లు తెలిపారు. సీఐ సాయి రమణ తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ కాశిబుగ్గకు చెందిన కేశబోయిన రంజిత్ అలియాస్ డిబ్బు, తాటికాయల రంజిత్ అలియాస్ బన్నీ, మేకల నిఖిల్ వీరితో పాటుగా ముగ్గురు మైనర్ బాలురు జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితులను గిర్నిబావి వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న కారును తనిఖీ చేయగా నిందుతులు పారిపోయే ప్రయత్నంలో పట్టుకొని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుల వద్ద నుంచి కారు, దొంగిలించిన బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. చోరీ కేసులో ప్రతిభ కనబరచి వారం వ్యవదిలోనే కేసును ఛేదించిన దుగ్గొండి ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ లు రంజిత్, శ్రీనివాస్, శేఖర్ రాకేష్, పూర్ణ చందర్ లను నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ అభినందించారు.

Tags:    

Similar News