MLA : మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం..

మహిళా సాధికారతనే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి అన్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ 15,16,17వ డివిజన్లలో ఎమ్మెల్యే రేవూరి విడివిడిగా సమీక్షా సమావేశం నిర్వహించారు.

Update: 2024-10-26 14:59 GMT

దిశ,గీసుగొండ: మహిళా సాధికారతనే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి అన్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ 15,16,17వ డివిజన్లలో ఎమ్మెల్యే రేవూరి విడివిడిగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. వివిధ శాఖల అధికారులు ఒకరికి ఒకరు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. విద్యా, వైద్యం పేద ప్రజలకు అందేలా అధికారులు నిరంతరం పనిచేయాలన్నారు.

గంజాయి మాదకద్రవ్యాలు మత్తుపదార్థాల పై నిఘా పెంచాలని వాటిని సప్లై చేసే వారిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. డివిజన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని అన్నారు. డివిజన్లలో త్రాగునీరు పారిశుద్ధ్యం, దోమల నివారణకు ఫాగింగ్ ఆయిల్ బాల్స్ అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే రేవూరి అన్నారు. ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాంకడే, తహసీల్దార్ రియాజుద్దీన్, గిర్దవార్ సాంబయ్య, ఆయా శాఖల డీఈలు, ఏఈలు టిపిసిసి కోఆర్డినేటర్ ప్రొఫెసర్ గాదె దయాకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొండేటి కొమురా రెడ్డి, మొగిలిచర్ల ప్యాక్స్ చైర్మన్ దొంగల రమేష్, సారయ్య డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


Similar News