ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు : కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి సందేహాలు నివృత్తి చేసేందుకు, ఫిర్యాదుల స్వీకరణకు సంబంధించిన వివరాల కోసం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసినట్లు

Update: 2024-12-12 13:54 GMT

దిశ, హనుమకొండ : ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి సందేహాలు నివృత్తి చేసేందుకు, ఫిర్యాదుల స్వీకరణకు సంబంధించిన వివరాల కోసం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1800425115 ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ అన్ని పని దినాలలో ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ టోల్ ఫ్రీ నెంబర్ పని చేస్తుందన్నారు. ఇందుకుగాను 2బి హెచ్ కె జిల్లా నోడల్ అధికారులుగా శ్రీనివాసులు, 2బి హెచ్ కె మేనేజర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఇంజనీర్ రమాదేవి సందేహాలను నివృత్తి చేస్తారని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు.


Similar News