ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు ఉండాలన్నదే సీఎం సంకల్పం : ఎమ్మెల్యే
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పమని మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
దిశ, లింగాలఘణపురం : నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పమని మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొత్తగా మంజూరైన 108 సర్వీస్ ను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరంలో వైద్య రంగానికి పెద్ద పీట వేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలలో డాక్టర్లు ఏర్పాటు చేయడం కోసం 681 డాక్టర్ రిక్రూట్మెంట్ చేయడం జరిగిందన్నారు. జనగామ జిల్లాకు 18 మంది నీ కేటాయించగా ఘన్ పూర్ నియోజకవర్గానికి 5గురు వచ్చినట్టు తెలిపారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడం కోసం, 100 పడకల ఆసుపత్రి కావాలని ముఖ్యమంత్రిని కోరగా, మంజూరు చేసినట్టు తెలిపారు. ఆస్పత్రి నిర్మాణ కోసం ఆర్టీసీ చెందిన 4 ఎకరాల భూమిని కేటాయించి రూ.45 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం 30 వేల జనాభాలకు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ను చేయాలని ప్రామాణికంగా పెట్టుకోగా, అందులో భాగంగా నియోజకవర్గంలోని, చిల్పూర్, కాంచన పెళ్లి , పెద్ద పెండ్యాల గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. ప్రాథమిక కేంద్రాల లో అన్ని సదుపాయాలు ఉన్నాయని, క్వాలిఫైడ్ డాక్టర్స్, శిక్షణ పొందిన నర్సులు ఉన్నారన్నారు. ఎలాంటి సదుపాయం లేని ప్రైవేట్ ఆస్పత్రుల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని, వైద్య అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించి, ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య, విద్యకు ఎక్కువ ప్రాధాన్యత తీస్తున్నారని, 9 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు టీచింగ్ ఆసుపత్రులు వచ్చాయన్నారు. నాణ్యమైన విద్య అందించిన లక్ష్యంతో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా 54 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించనుంది అన్నారు. ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి రూ.200 కోట్ల కేటాయించనుంది అన్నారు. ఇవి అందుబాటులోకి వస్తే, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్, డిప్యూటీ వైద్య అధికారిని శ్రీదేవి, తహశీల్దార్ రవీందర్, ఎంపీడీవో జలంధర్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి నర్సింహులు, డాక్టర్లు రవితేజ, హారిక, కిరణ్, సుస్మిత, సంధ్య, మాజీ జెడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి, జీడికల్ చైర్మన్ మూర్తి,బిట్ల బాబు, దూసరి గణపతి, మార్కెట్ డైరెక్టర్లు నీలంమోహన్, శ్రీలత రాజ రవీందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అబ్బాస్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రాజశేఖర్ నాయకులు ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఉప్పల మధు, పిట్టల రాజు, అనిల్ గౌడ్, కుకట్ల మల్లయ్య, నాగేందర్, అశోక్, నాగరాజు, పసునూరు ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.