Deputy CM: డిప్యూటీ సీఎం భట్టితో ఎంపీల భేటీ.. వాస్తవాలు తెలిపారని ఎంపీ చామల ట్వీట్
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka)తో కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kirankumar Reddy) ఇవాళ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టితో తెలంగాణ ఎంపీల అల్పాహార విందులో పాల్గొన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలపై ఎంపీలుగా తమకు అవగాహన అవసరం కాబట్టి డిప్యూటీ సీఎంతో అన్ని అంశాలపై చర్చ జరిగిందన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుందని, అమలు చేస్తున్న అన్ని అంశాలపై స్పష్టత ఇచ్చారని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు అన్నిటినీ తెలియజేశారు.. అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భట్టితో ఎంపీలు దిగిన ఫోటోను పంచుకున్నారు.