Minister Konda Surekha : కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవాలపై మంత్రి కొండా సురేఖ సమీక్ష

డిసెంబర్ 29 నుండి 19 జనవరి 2025 వరకు జరగనున్న కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణోత్సవాల(Komuravelli Mallanna) సన్నాహాలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)సచివాలయంలోని తన పేషిలో సమీక్ష నిర్వహించారు.

Update: 2024-12-12 12:15 GMT

దిశ, వెబ్ డెస్క్: డిసెంబర్ 29 నుండి 19 జనవరి 2025 వరకు జరగనున్న కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణోత్సవాల(Komuravelli Mallanna) సన్నాహాలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)సచివాలయంలోని తన పేషిలో సమీక్ష నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker) ఈ సమీక్షా సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపునా తీసుకోవాల్సిన చర్యలు, భక్తులకు అవసరమైన రవాణ, తాగునీరు, పారిశుధ్య వసతులు, దేవాలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చించారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న కల్యాణం తిలకించడానికి వేలాదిగా తరలిరానున్నందునా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, సిద్దిపేట ఆర్డివో, కొమురవెల్లి ఆలయ ఏఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News