అక్రమంగా ఎడ్ల బండిలో తరలిస్తున్న కలప స్వాధీనం...

బూరుపేట గ్రామ శివారు కలపను అక్రమంగా తరలిస్తున్న మూడు ఎడ్లబండ్లను ఫారెస్ట్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-11-14 08:30 GMT

దిశ, ములుగు ప్రతినిధి : బూరుపేట గ్రామ శివారు కలపను అక్రమంగా తరలిస్తున్న మూడు ఎడ్లబండ్లను ఫారెస్ట్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే ములుగు జిల్లా వెంకటాపుర్ మండలం బూరుగు పేట గ్రామ శివారులో ఉన్న అడవిలో రాత్రిళ్ళు అక్రమంగా కలపను నరికి ఎడ్లబండతో తరలిస్తున్నారు.

ఈ సమాచారంతో అటవీశాఖ అధికారి డోలి శంకర్ తన సిబ్బందితో వెళ్లి గురువారం తెల్లవారుజామున తనిఖీ చేయగా మూడు ఎడ్లబండ్లలో తరలిస్తున్న జిట్టి రేగు, టేకు కలప గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా కలపను తరలిస్తున్న నిందితులతో పాటు ఎడ్లబండ్లను, ఎడ్లను ములుగు జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. ఎడ్లబండ్లలో తరలిస్తున్న కలప సుమారు లక్ష ఇరవై వేల వరకు విలువ ఉంటుందని ఎఫ్ఆర్ఓ డోలి శంకర్ తెలిపారు. కల్పన తరలిస్తున్న వ్యక్తుల పై అటవీ పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News