బహిరంగ సభలో హామీల వర్షం కురిపించిన ప్రియాంక గాంధీ

తొర్రూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఫుల్ సక్సెస్ అయిందని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2023-11-24 13:41 GMT

దిశ, తొర్రూర్ : తొర్రూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఫుల్ సక్సెస్ అయిందని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అక్కడికి వచ్చిన పాలకుర్తి ప్రజానీకం ప్రియాంక గాంధీ హామీలకు తీన్మార్ మల్లన్న చెప్పిన మాటలకు ఆకర్షితులయ్యారు. అదేవిధంగా సభకు అనుకున్న ప్రజల కంటే రెండు రెట్లు ఎక్కువ మంది వచ్చారంటూ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యువనాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. తొర్రూర్ లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభకు హాజరైన ప్రియాంక గాంధీ.. ఈ ప్రభుత్వ పాలన పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు.. ప్రతి ఇంటికి రూ. 400కే వంట గ్యాస్ ఇస్తామని తెలిపారు. మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి అన్నదే మన నినాదం అని గుర్తుచేశారు. రైతులకు రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. వరి పై కనీస మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇస్తామన్నారు.

రైతులకు ప్రతి ఏటా రూ. 15వేల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా రూ. 12 వేలు ఇస్తామన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఉద్యోగాలు ఎక్కువగా ఇస్తున్నామన్నారు. రాజస్థాన్‌లో 2లక్షల ఉద్యోగాలిచ్చామని తెలిపారు. దేశంలోనే నిరుద్యోగుల విషయంలో తెలంగాణ అట్టడుగున ఉందని విమర్శించారు. యువత కోసం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ అని హామీ ఇచ్చారు. పేపర్ లీకులతో యువత ఆత్మహత్యలు చేసుకుంటోందని తెలిపారు. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. వీటన్నింటితో పాటు ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని సభావేదికగా హామీల వర్షం కురిపించారు. ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీలకు సభకు వచ్చిన ప్రజలు ఆకర్షితులయ్యారు. అందుకు సభ ఫుల్ సక్సెస్ అయినట్లు ఇటు నాయకులు అటు ప్రజలు ఇద్దరు ఆనందంతో అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News