మంత్రి కేటీఆర్ పర్యటన వాయిదాకు కారణం ఇదే...

ఆదివారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ప్రగతి నివేదిక సభకు మంత్రి కేటీఆర్ హాజరు కావాల్సి ఉండగా ... అనారోగ్య కారణాల వలన ఆదివారం జరగాల్సిన సభ వాయిదా పడిందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు

Update: 2023-10-07 14:21 GMT

దిశ, అచ్చంపేట : ఆదివారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ప్రగతి నివేదిక సభకు మంత్రి కేటీఆర్ హాజరు కావాల్సి ఉండగా ... అనారోగ్య కారణాల వలన ఆదివారం జరగాల్సిన సభ వాయిదా పడిందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. శనివారం సాయంత్రం ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి సభ వేదిక వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ నిత్యం ప్రజల్లో ఉంటూ.. సభలు సమావేశాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు విరామం లేకుండా పాల్గొంటున్న సందర్భంగా.. వాతావరణం మార్పు మూలంగా మంత్రికి కాస్త అనారోగ్యం కావడంతో రెండు రోజుల రెస్ట్ కావాలని వైద్యులు సూచించడంతో ఆదివారం జరగాల్సిన సభ వాయిదా పడిందని అందుకు సంబంధించిన సమాచారం మంత్రి కార్యాలయం నుండి సమాచారం అందిందన్నారు.

నియోజకవర్గ రైతులు, ప్రజలు ఎవ్వరు నొచ్చుకోకుండా ఉండాలని, తిరిగి ఒకటి రెండు రోజులలో మంత్రి కేటీఆర్ చేతుల మీద గాని ఉమామహేశ్వర, చెన్నకేశవ ప్రాజెక్టు శంకుస్థాపన ఉంటుందన్నారు. పై ప్రాజెక్టు విషయం అసెంబ్లీలో క్యాబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా ఆనాటి నుండి నేటి వరకు ప్రతిపక్షాలు విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలలో లేరని, ప్రజలు మంచి విశ్వాసంతో ఉన్నారన్నారు. సభకు కాస్త సమయం దొరకడంతో ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా ప్రగతి నివేదిక సభను అంబరాన్ని అంటేలా నిర్వహిస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మనోహర్, నరసింహ గౌడ్, పి ఎ సి ఏ సి చైర్మన్ రాజిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ తులసి రామ్ నాయక్, నాయకులు అమీనుద్దిన్, లోకనాయక్, రాంబాబు నాయక్, అనిల్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News