అగ్నిప్రమాదాలు అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రతలు ఇవే..
అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా హనుమకొండ అగ్నిమాపక కేంద్రంలో ఆదివారం అగ్నిమాపక సిబ్బంది రోహిణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు హాస్పిటల్‌లో వివిధ అగ్నిప్రమాదాలు ఎలా జరుగుతాయి? వాటిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రతలు ఏంటి? అనే వాటి గురించి చాలా క్లుప్తంగా వివరించారు.
దిశ, హనుమకొండ టౌన్ : అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా హనుమకొండ అగ్నిమాపక కేంద్రంలో ఆదివారం అగ్నిమాపక సిబ్బంది రోహిణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు హాస్పిటల్‌లో వివిధ అగ్నిప్రమాదాలు ఎలా జరుగుతాయి? వాటిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రతలు ఏంటి? అనే వాటి గురించి చాలా క్లుప్తంగా వివరించారు.
తదుపరి వివిధ అగ్నిమాపక పరికరాలను అగ్నిప్రమాదం ఏదైనా సంభవించినప్పుడు ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రత్యక్షంగా వివరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్, డైరెక్టర్లు, డాక్టర్లు, అగ్నిమాపక కేంద్ర అధికారి ఏ. నాగరాజు, ప్రధాన అగ్నిమాపకులు కె జనార్దన్, జీ.నర్సింహ, డ్రైవర్ ఏం. శ్రీనివాస్, ఫైర్ మెన్ ఏ. రవీందర్, నర్స్‌లు, సెక్యూరిటీ పాల్గొన్నారు.