గిరిజనులే గిరిజన మాజీ సర్పంచ్ పై దాడి.. ఉద్రిక్త పరిస్థితి
భూ వివాదంలో గిరిజనేతరుడి తరుపున న్యాయం మాట్లడని గిరిజన మాజీ సర్పంచ్ పై కొంత మంది గిరిజనులు దాడికి దిగిన ఘటన ఏటూరునాగారం మండలం చిన్నబోయిన పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
దిశ, ఏటూరునాగారం: భూ వివాదంలో గిరిజనేతరుడి తరుపున న్యాయం మాట్లాడాడని గిరిజన మాజీ సర్పంచ్ పై కొంత మంది గిరిజనులు దాడికి దిగిన ఘటన ఏటూరునాగారం మండలం చిన్నబోయిన పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. శివపురం గ్రామానికి చెందిన వంగపండ్ల రవి అనే గిరిజనేతర వ్యక్తికి స్థానికంగా ఉన్న కొంత మంది గిరిజనులకు భూమికి సంభందించిన వివాదం కొనసాగుతుందని అయితే దసరా కు ముందు రోజు కూడా వీరి ఇరువురికి ఘర్షణ తో కూడిన సంభాషణ కొనసాగగా స్థానికంగా ఉన్న పెద్ద మనుషులు కల్పించుకుని గొడవను సర్ది పుచ్చారు.
తిరిగి మరలా గురువారం రోజున మధ్యాహ్న సమయంలో మళ్లీ భూవివాదం మొదలవడంతో స్థానికంగా ఉన్న మాజీ గిరిజన సర్పంచ్ చెల వినయ్ దృష్టికి వెళ్లింది. అయితే వంగపండ్ల రవి వైపు న్యాయం ఉందని తనను ఇబ్బంది పెట్టవద్దని న్యాయం చేప్పింనందుకు మాజీ గిరిజన సర్పంచ్ చెల వినయ్ పై గురువారం సాయంత్రం గిరిజన వ్యక్తులు మధ్యం సేవించి కత్తులతో దాడికి దిగినట్లుగా స్థానికులు తెలిపారు. అయితే స్థానికులు గొడవ జరుగుతున్న విషయంమై స్థానిక పోలిస్ స్టేషన్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించగా ఘటన స్థలానికి ఎస్సై, సీఐ లు చేరుకోని గొడవను అపే ప్రయత్నం చేయగా ఎస్సై, సీఐలపై కొంత మంది దాడికి ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు.అయితే ఈ ఘర్షణలో గాయాల పాలైన వంగపండ్ల రవి, చెల వినయ్, మరొక వ్యక్తిని ఏటూరునాగారం సామాజిక ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.