ఈ బుడ్డోడి రూటే వేరు.. నిన్న సర్ మీద కేసు.. నేడు తాటివనం‌లో కల్లు..

దిశ,మహబూబాబాద్ : నిన్న 3వ తరగతి చదువుతున్న అనిల్ అనే ఓ ఎనిమిది ఏండ్ల బుడతడు..

Update: 2022-03-06 07:19 GMT

దిశ,మహబూబాబాద్ : నిన్న 3వ తరగతి చదువుతున్న అనిల్ అనే ఓ ఎనిమిది ఏండ్ల బుడతడు.. సర్ కొడుతున్నాడని ఓ ప్రయివేట్ స్కూల్ టీచర్ పై మహ బూబాబాద్ జిల్లా బయ్యారం మండలం‌లో పోలీసు స్టేషన్ కి నేరుగా వెళ్ళి ఎస్సై రమాదేవి‌కి ఫిర్యాదు చేశాడు. ఈ బుడతోడి ధైర్య సాహసాలకు పోలీసులు, స్థానికులు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరలైంది. కాగా, ఈ సంఘటన ను స్థానికులు పూర్తిగా మరిచిపోకముందే మళ్ళీ ఈ బుడతడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా నిలిచాడు. ఆదివారం పొద్దున్నే పోద్దాడు కల్లును మర్రి ఆకులో పట్టి అబ్బురపర్చాడు. నిన్న సర్ మీద కేసు పెట్టి.. నేడు తాటి వనం‌లో కల్లు తాగుతూ దావత్ చేస్తున్నాడని అక్కడ ఉన్నవారు చమత్కరించారు.

Tags:    

Similar News