సంక్షేమ సంబురాల వేడుకల్లో పాల్గొన్న మంత్రి..
సంక్షేమం అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
దిశ, పాలకుర్తి : సంక్షేమం అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం చూడాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పలుఅభివృద్ధి పథకాలతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల సర్వతో ముఖాభివృద్దికి పాటుపడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శుక్రవారం పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ సంక్షేమ ఉత్సవాల సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సబండ వర్గాల అభివృద్దే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు ఆవేశపెట్టి వాటి ద్వారా ప్రజల జీవనప్రమాణాలు పెరగడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ సంక్షేమ రంగంలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్యం చేశారు.
పాలకుర్తి కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేశారు. ఆయాచొట్ల కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, గొర్రెల పంపిణీ, బీసీ కులాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను మంత్రి ఎర్రబెల్లి లబ్ధిదారులకు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాలను సమంగా అమలు చేస్తూ, రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా మార్చింది అన్నారు. మన రాష్ట్రం, నియోజకవర్గంలో అమలు అవుతున్నన్ని పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ, ఆయా పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఇంట్లో సంక్షేమం ప్రతి ముఖంలో సంతోషం చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం.
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు మన రాష్ట్ర ప్రగతికి గుర్తులు. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ కు అభివృద్ధి, సంక్షేమం రెండు రెండు కళ్ళు, ఒక బండికి రెండు ఎడ్ల లాగా, అభివృద్ధి, సంక్షేమాలను సీఎం సమానంగా నడిపిస్తున్నారని మంత్రి తెలిపారు. నేడు తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాల్లో ఒక మోడల్ గా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాజనీతిని కనబరుస్తూ పనిచేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో తెలిపేందుకు తెలంగాణ ప్రగతి ఒక కొలమానం అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కపుల్ దేశాయ్ డీఆర్డీఓ రాంరెడ్డి ఆయా మండలాల ప్రజాప్రతినిధులు ఆయా శాఖల అధికారులు మహిళలు ప్రజలు లబ్ధిదారులు పాల్గొన్నారు.