Marthineni Dharma Rao : సస్పెండ్ చేసే అధికారం జిల్లా అధ్యక్షుడు కి లేదు

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మానుకోట జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ పై ఆరు సంవత్సరాలు

Update: 2024-10-27 13:20 GMT

దిశ, దంతాలపల్లి: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మానుకోట జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ పై ఆరు సంవత్సరాలు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు 25-10-2024 ప్రకటించిన విషయం విదితమే. దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ మార్తినేని ధర్మారావు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, సస్పెండ్ చేయడం లాంటివి జిల్లా అధ్యక్షుల పరిధిలో లేని విషయం అని ఓ లేఖపూర్వకకంగా ప్రకటనలో తెలిపారు. ఇలాంటి చర్యలను పార్టీ పరిగణలోకి తీసుకోవడం జరగదు అని తెలిపారు.


Similar News