బస్టాండ్ నిర్మించారు.. బాత్రూములు మరిచారు!

అది ఓ జాతీయ రహదారి పక్కనే ఉండి నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే బస్టాండ్, కానీ ఏం లాభం ప్రయాణికులు చెప్పుకోలేని బాధతో బాత్రూములు లేక సతమతమవుతూ అవస్థలు పడుతున్నారు.

Update: 2023-05-11 06:46 GMT

దిశ, రాయపర్తి : అది ఓ జాతీయ రహదారి.. పక్కనే ఉండి నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే బస్టాండ్, కానీ ఏం లాభం ప్రయాణికులు చెప్పుకోలేని బాధతో బాత్రూములు లేక సతమతమవుతూ అవస్థలు పడుతున్నారు. వివరాల్లోకెళ్తే.. వరంగల్ ఖమ్మం 563 జాతీయ రహదారి పక్కనే రాయపర్తి మండల కేంద్రంలోని గత మూడు సంవత్సరాల క్రితం 20 లక్షల రూపాయలతో బస్టాండ్ నిర్మించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా బస్టాండ్ ఓపెన్ చేసి ప్రయాణికులకు అంకితం చేశారు.

కానీ బస్టాండ్ నిర్మాణం పూర్తయిన ప్రయాణికులకు అవసరమయ్యే మౌలిక వసతులు కరువయ్యాయి. కాగా.. బస్టాండ్‌లో బత్రూం లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ విషయంపై కాంట్రాక్టర్‌ను వివరణ కోరగా.. ఎస్టిమేషన్లో బాత్రూం మెన్షన్ లేదని, అది నా పరిధిలో లేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు చొరవ చూపి బస్టాండ్లో బాత్రూంలతో పాటు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Tags:    

Similar News