MLA : రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వీని రెడ్డి అన్నారు.

Update: 2024-10-17 12:06 GMT

దిశ, కొడకండ్ల : రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వీని రెడ్డి అన్నారు. మండలంలోని నరసింగాపురంలో బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో చేప పిల్లలను వదిలి, అనంతరం మండల కేంద్రంలోని గురువారం వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం కొనుగోలు కేంద్రలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతులను రాజు చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చేసిందని, ఇప్పుడు కొత్తగా సన్న వడ్ల కు రూ.500 రూపాయల బోనస్ కూడా ఇస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎవరు దళారులను నమ్మొద్దని, నేరుగా వడ్లను ప్రభుత్వానికి ఇస్తేనే ప్రభుత్వ రేటు ఇస్తుందని అన్నారు.

ఈ సారి రైతులకు ఏలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం పలువురు రైతులు, కాంగ్రెస్ నేతలు ఐకెపి అధికారుల తీరును తప్పుబట్టారు. ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి వస్తే చిన్న టెంట్ వేసి 20 కుర్చీలు వేయడంతో ఆందోళన చేశారు. కనీసం ఎమ్మెల్యే మాట్లాడడానికి మైకు కూడా ఏర్పాటు చేయలేదని రైతులు,కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రాజరాజేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మండల కేంద్రంలో ఏర్పాటు కాబోతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు సంబంధించిన స్థలం ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, జిల్లా ఐకెపి,మార్కెట్ అధికారులు ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సురేష్ నాయక్, రాకేష్ నాయక్, సునీల్ రెడ్డి, వనం మోహన్ తదితరులు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.


Similar News