Suspension: అన్యాయంగా సస్పెండ్ చేశారు..! ఆందోళనకు దిగిన ఆర్టీసీ ఉద్యోగులు

తనను అన్యాయంగా విధుల నుంచి సస్పెండ్ చేశారంటూ జనగామ జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఓ కండక్టర్‌కు ఆందోళనకు దిగారు.

Update: 2024-08-07 04:23 GMT

దిశ, జనగామ: తనను అన్యాయంగా విధుల నుంచి సస్పెండ్ చేశారంటూ జనగామ జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఓ కండక్టర్‌కు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 1న జనగామ నుంచి హనుమకొండకు వెళ్తున్న బస్సులో ఓ గర్భిణి ఎక్కింది. దీంతో బస్సు కిక్కిరిసి ఉండటంతో గమనించిన కండక్టర్ భూక్యా శంకర్ గర్భిణికి సీటు ఆపినందుకు ప్రయాణికులతో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆ గొడవ కాస్త ఆర్టీసీ అధికారుల దృష్టి వెళ్లడంతో ఎలాంటి విచారణ లేకుండా వారు కండక్టర్‌ శంకర్‌ను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే తోటి ఉద్యోగులు శంకర్‌కు బాసటగా నిలిచారు. అసలేం జరగిందో తెలుసుకోకుండా ఉద్యోగిపై చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తారు. ఈ మేరకు వారంతా సీఐటీయూ నాయకులతో డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే ఉద్యోగి కండక్టర్ శంకర్‌పై సస్పెన్షన్ ఆర్డర్ ఎత్తివేయాలని అదేవిధంగా సీఐ, డిపో మేనేజర్ మీద తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News