రైతులను వదిలేసిన ప్రభుత్వం.. వడ్లు కొనుగోలు తీరుపై Sridhar Babuఫైర్..

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికి వదిలేసిందని, పెట్టుబడి సాయం ఇస్తున్నామంటూ రైతులను పట్టించుకోవడం లేదని శ్రీధర్ బాబు ఆరోపించారు.

Update: 2022-12-21 10:08 GMT

దిశ, కాటారం: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికి వదిలేసిందని, పెట్టుబడి సాయం ఇస్తున్నామంటూ రైతులను పట్టించుకోవడం లేదని శ్రీధర్ బాబు ఆరోపించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం తీరు సమంజసంగా లేదని, ఫైన్ రకం వడ్లు కొనుగోలు చేస్తూ కామన్ రకం వడ్లు కొనుగోలు చేయడం లేదని ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ, శంకరపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. 1001 రకం వడ్లను కల్లంలో నెల రోజులుగా అరబోసిన కొనుగోలు చేయాలేదని, ఎంత ప్రాధేయపడుతున్న తమ సమస్యలను పట్టించుకోవడం లేదని రైతులు దుద్దుల శ్రీధర్ బాబుకు ఫిర్యాదు చేశారు. వ్యవసాయం చేయడంలో రైతులకు ఎలాంటి లాభం లేదని ధాన్యం అమ్మడానికి ఇబ్బందులు పడుతున్నామని, ఫైన్ రకం ధాన్యం అమ్మినప్పుడు బస్తాకు మూడు కిలోలు కటింగ్ చేశారని, కల్లాల వద్దే ఉంటున్నామని మహిళా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు దొడ్డు రకం బీ వర్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్న ట్లు అందుకే నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నారు.

ట్రక్ షీట్ సైతం రైతులకు ఇవ్వడం లేదని, ఈ జిల్లాలోనే ఈ పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నుండే జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా పౌరసరఫరాల అధికారితో మాట్లాడి 1001 రకం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కోరారు. సమీపంలోని ఇతర జిల్లాల మిల్లులకు ఈ ధాన్యం ఖరీదు చేసేలా ఆ రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించాలని అధికారులకు శ్రీధర్ బాబు సూచించారు. ఇలా చేసైనా కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు.. కుప్పలుగా ఉన్న ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తొందరగా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని రైతులు ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో ప్రాధేయపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య, మండల శాఖ అధ్యక్షుడు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, శంకరం పల్లి సర్పంచ్ అంగజాల అశోక్, నాయకులు కారెంగుల తిరుపతి, అజ్మీర రాజు నాయక్, గద్దె సమ్మిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సమ్మయ్య రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News