అక్రమ రవాణా నియంత్రించాలి : ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతరం నిఘా,సరిహద్దు రాష్ట్రాల నుంచి
దిశ,డోర్నకల్: చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతరం నిఘా,సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా నియంత్రించేందుకు రాత్రి వేళ గస్తీ,పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశించారు. సోమవారం డోర్నకల్ రక్షకభట నిలయాన్ని ఆకస్మిక తనిఖీ జరిపి రికార్డులు పరిశీలించారు.తొలుత గౌరవ వందనం స్వీకరించారు.ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. డయల్ 100కు తక్షణ స్పందించి సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్,పెట్రోల్ కార్ నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు.ఆయన వెంట డీఎస్పీ తిరుపతిరావు,డీఆర్సిబీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ,సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు,సీఐ రాజేష్ నాయక్,ఎస్సై వంశీధర్ తదితరులున్నారు.