బుట్టాయిగూడెంలో ప్రారంభమైన సమ్మక్క- సారలమ్మ జాతర

బుట్టాయిగూడెం గ్రామంలో సమ్మక్క -సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు గురువారం పెద్ద సంఖ్యలో విచ్చేశారు. సమ్మక్క-సార్లమ్మ వనదేవతలు వనం నుండి

Update: 2023-02-09 16:45 GMT

దిశ, కన్నాయిగూడెం: బుట్టాయిగూడెం గ్రామంలో సమ్మక్క -సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు గురువారం పెద్ద సంఖ్యలో విచ్చేశారు. సమ్మక్క-సార్లమ్మ వనదేవతలు వనం నుండి జనంలోకి వచ్చి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో .తరలి వచ్చిఅమ్మవార్లను దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మలు గద్దలపై కి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని తల్లులకు భక్తులు తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు. బుట్టాయిగూడెం గ్రామానికి భక్తులు కుటుంబసమేతంగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకొని చీరలు, పూలు,పండ్లు సమర్పించ, అనంతర గుడి పరిసరాల ప్రాంగణంలో కోళ్లు, మేకలతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుని విందు జరుపుకొని ఉల్లాసంగా గడిపారు. బుట్టాయిగూడెం పరిసరాలు. భక్తులతో కిటకిటలాడాయి.

Tags:    

Similar News