పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించొద్దు : పోలీస్ కమిషనర్

పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే రీతిలో స్టేషన్ అధికారులు వ్యవహరించవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.

Update: 2024-12-20 10:23 GMT

దిశ, జనగామ : పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే రీతిలో స్టేషన్ అధికారులు వ్యవహరించవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం చిల్పూర్ పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ తనిఖీ చేశారు. కమిషనర్ కు పోలీస్ అధికారులు మొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసుల గౌరవ వందనం చేశారు. ముందుగా పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం సిబ్బందికి పోలీస్ శాఖ మంజూరు చేసిన కిట్ ఆర్టికల్స్ ను పోలీస్ కమిషనర్ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పెండింగ్ కేసులు, నిందితుల అరెస్ట్, రౌడీ షీటర్ల వివరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు కోర్ట్ లో పెండింగ్ లో ఉన్న కేసులు, వాటికి సంబందించిన దర్యాప్తు వివరాలను పోలీస్ కమిషనర్ స్టేషన్ సబ్ ఇన్స్ స్పెక్టరు ను అడిగి తెలుసుకున్నారు.

అలాగే స్టేషన్ లో నిర్వహిస్తున్న పలురకాల రికార్డులను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… ప్రధాన రోడ్డు మార్గంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని, అలాగే ట్రాన్స్ఫార్మర్స్ దొంగతానాల నివరణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అలాగే పోలీస్ స్టేషన్ కు అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమస్యతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలని తెలిపారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించాలని, ప్రజలకు పోలీసులపై ఉన్న నమ్మకానికి తగ్గట్టుగానే పోలీసులు, నిజాయితీతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. చివరగా పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. ఈ తనిఖీల్లో ఎ.ఎస్పీ మానాన్ భట్ ఘన్పూర్, ఏసీపీ భీం శర్మ , సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్.ఐ నవీన్ కుమార్ తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


Similar News