నకిలీ బయో పురుగు మందుల తయారీ…మహాదేవపూర్ లో గుట్టురట్టు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ కేంద్రంగా నకిలీ బయో పురుగు మందుల తయారీ,
దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ కేంద్రంగా నకిలీ బయో పురుగు మందుల తయారీ, విక్రయాలను వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం గుట్టు రట్టు చేశారు. మహాదేవపూర్ ఏడిఏ శ్రీపాల్ వ్యవసాయ అధికారిని సుప్రజ్యోతి తెలిపిన, పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు మహాదేవపూర్ మండల కేంద్రంలో గల ఆగ్రో స్కై సీడ్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్ దుకాణం ను శుక్రవారం తనిఖీ చేయగా వివిధ రకాల పురుగుమందులు, గ్రోత్ ప్రమోటర్, కీటక నాశనులు, శిలీంద్ర నాశనీలు, క్రిమి సంహారక మందుల పేర్లతో సరైన పత్రాలు, బిల్లులు, స్టాక్ రిజిస్టర్స్ సరుకు సంబంధించిన ఇన్వాయిస్ లు, లేబిలింగులు లేకుండా రైతుకు రసీదు ఇవ్వకుండా స్టాక్ బోర్డ్ లో సమాచారం పొందుపరచకుండా విక్రయిస్తున్నారని తెలిపారు.
వివిధ రకాల లేబుల్ లేని డబ్బాలు, నకిలీ ప్రింటెడ్ అత్తాలు మూతలను దుకాణంలో ఉన్నట్లు తెలిపారు. దాదాపు రూ. 13 లక్షల సరుకును రైతులు వ్యవసాయ విస్తరణ అధికారులు కే రచన, సిహెచ్ ధర్మేందర్, జి శరత్ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో కనుగొని ఈ స్టాకును స్టాప్ సేల్ చేసినట్లు తెలిపారు. దుకాణంలో ఠాకూర్ రమ్య, మహమ్మద్ రెహమాన్, అక్షయ, పిడుగు నాగరాజు అనే వ్యక్తులు ఆగ్రోస్ టైడ్స్ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ దుకాణం నందు పనిచేస్తున్నట్లు కౌంటర్ ముందు ఉన్నట్లు వ్యవసాయ అధికారి సర్టిఫికేషన్ లేని ఐదు బిల్ బుక్స్ ను స్వాధీనం పరుచుకున్నట్టు తెలిపారు.
నిషేధించిన గ్లైకోసెట్ గడ్డి మందు ఉన్నట్లు సమాచారం.
దుకాణంలో నకిలీ పురుగుమందుల తయారీ దుకాణం లోపలనే బయో కెమికల్స్ ను వివిధ సైజులలో గల ప్లాస్టిక్ డబ్బాల లో ఏదో ఒక కంపెనీ లేబుల్ను అతికించి ఎమ్మార్పీ,తయారీ, ఎక్స్పైర్ తేదీలను వీళ్లే ముద్రించి దుకాణంలో విక్రయిస్తున్నారని గుర్తించారు. బిల్లుపై గరిష్ట ధర వేసి రైతులకు డిస్కౌంట్ పేరుతో విక్రయిస్తున్నారని పలువురు ఆరోపించారు. ఈ మందులను కాటారం డివిజన్లోని వివిధ దుకాణాలకు హోల్ సేల్ గా విక్రయించినట్లు సమాచారం. కొన్ని నెలలుగా ఈ వ్యవహారం అంతా జరుగుతున్న ఇటీవలే బయటపడడం సంచలనంగా మారింది.
ఈ దుకాణంలో కొత్తగా ఈ ఏడాది ప్రారంభించగా దుకాణం లైసెన్స్, జి ఎస్ టి వేరువేరు పేర్ల మీద ఉండడం విస్మయానికి గురిచేస్తుంది. గతంలో వ్యవసాయ అధికారులు ఈ దుకాణం ను తనిఖీ చేయకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. మహాదేవపూర్ లో నకిలీ బయో మందుల తయారీ విక్రయాలు గుర్తు రట్టు కావడం జిల్లాలోనే సంచలనంగా మారింది. జిల్లాలోని ఎరువులు పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేసి నకిలీ విక్రయాలను అరికట్టాలని, నిబంధనల మేరకు రికార్డులు ఉండేలా చూడాలని రైతులు కోరుతున్నారు.