నిర్ణీత సమయంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలి
ఇందిరమ్మ ఇండ్ల సర్వేను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులను జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి ఆదేశించారు.
దిశ,గీసుగొండ: ఇందిరమ్మ ఇండ్ల సర్వేను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులను జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి ఆదేశించారు. మండలంలోని మరియాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే చేస్తున్న పంచాయతీ కార్యదర్శిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… లబ్ధిదారుల వివరాలను ఇందిరమ్మ ఆప్ లో అప్లోడ్ చేయడంతో పాటు, రిజిస్టర్ లో లబ్ధిదారుల వివరాలు రాసుకోవాలని కార్యదర్శి కి సూచించారు. నిర్ణీత సమయంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం డి రియాజుద్దీన్, ఎంపీడీఒ కృష్ణవేణి,ఎంపీఒ ఆడెపు ప్రభాకర్, గిరిధవార్ సాంబయ్య పాల్గొన్నారు.