అసైన్డ్ భూమి అమ్మకం…నోటీసులు జారీ చేసిన తహసీల్దార్.!
కురవి మండల కేంద్రంలోని సర్వేనెంబర్ 747 అసైన్డ్ భూమి లో క్రయవిక్రయాలు జరిగినట్లు కురవి తహసిల్దార్ గుర్తించారు
దిశ, మరిపెడ : కురవి మండల కేంద్రంలోని సర్వేనెంబర్ 747 అసైన్డ్ భూమి లో క్రయవిక్రయాలు జరిగినట్లు కురవి తహసిల్దార్ గుర్తించారు. ఈ మేరకు అసైన్డ్ యాక్ట్ ప్రకారం ఓ మహిళా యజమాని భర్తకు నోటీసులు అందజేసే ప్రయత్నం చేయగా అతడు తీసుకోకపోవడంతో నోటీస్ ని అతడు పనిచేసే చోట ఓ గోడకు అంటించినట్టు ఆర్ఐ నెల్లూరు రవికుమార్ తెలిపారు.15 రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, ఇదే వ్యవహారంలో మరో ఇద్దరు రైతులకు అసైన్డ్ భూముల చట్టం ప్రకారం ఇది వరకే నోటీసులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.అసైన్డ్ భూములను అమ్మొద్దు అని, తెలియక కొని భాధితులు మోసపోవద్దు అని ఆయన సూచించారు. కాగా 747 సర్వే నెంబర్ గల భూముల వ్యవహారం వివాదాలకు కేరాఫ్ గా మారుతుందని పూర్తి స్థాయిలో కలెక్టర్ దృష్టి సారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి అని మండల ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.