మృతదేహంతో జాతీయ రహదారిపై బైఠాయింపు

ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పట్టుకొని, మృతురాలు కుటుంబానికి న్యాయం చేయాలంటూ మండలంలో నెల్లుట్ల బైపాస్ లోని హైదరాబాద్ - వరంగల్

Update: 2024-11-12 12:46 GMT

దిశ, లింగాలఘణపురం : ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పట్టుకొని, మృతురాలు కుటుంబానికి న్యాయం చేయాలంటూ మండలంలో నెల్లుట్ల బైపాస్ లోని హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై మృతదేహంతో బైఠాయించి ధర్నా చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… వడ్డెర కాలనీకి చెందిన రాములమ్మ సోమవారం వ్యవసాయ బావి వద్దకు వెళుతుండగా వెనుక నుండి కారు ఢీకొట్టడంతో మృతి చెందిందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పట్టుకొని మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు ఇంతవరకు పట్టించుకోలేదంటూ, న్యాయం చేసే వరకు మృతి దేహంతోనే బైఠాయిస్తామని 40 నిమిషాలు హైవేపై బైఠాయించారు.

ఎస్సై శ్రావణ్ కుమార్, పోలీసులు విరమింప చేసే ప్రయత్నం చేసిన వినకపోవడంతో స్టేషన్ ఘన్ పూర్ ఏసిపి భీమ్ శర్మ సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ప్రమాదం జరిగిన కొద్ది దూరంలో కారును వదిలేసి పారిపోయాడని అతను కరీంనగర్ జిల్లా సైదాపురం కు చెందిన వ్యక్తిగా గుర్తించామని తెలిపారు. అతన్ని పట్టుకునే పనిలో ఉన్నామని తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకొని మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు ధర్నా విరమించి మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. జాతీయ రహదారి పై ధర్నా చేస్తుండగా ప్రయాణికుల ఇబ్బంది కలగకుండా పోలీసులు జనగామ మీదుగా ట్రాఫిక్ మరలించారు.


Similar News