ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
దిశ, ములుగు: ములుగు జిల్లాలో శనివారం ఉదయం సుమారు 4 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన ఒకే కుటుంబంలోని 8మంది ఆటోలో అన్నా
దిశ, ములుగు: ములుగు జిల్లాలో శనివారం ఉదయం సుమారు 4 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన ఒకే కుటుంబంలోని 8మంది ఆటోలో అన్నారం షరీఫ్ జాతరకి వెళ్లి తిరిగి వస్తుండగా ములుగు జిల్లా జంగాలపల్లి దగ్గరలో గల ఎర్రి గట్టమ్మ దగ్గర డీసీఎం వ్యాన్, ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో చెల్లామల్ల కిషోర్, తునికి జానీ ఆటో డ్రైవర్, సందీప్, వృద్ధురాలు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా.. చికిత్స పొందుతూ పద్మ, చిన్నారి వెన్నెల మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 6కి చేరుకుంది.. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కి తరలించి వైద్యం అందిస్తున్నారు. సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.