తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి : Thatikonda Rajaiah
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్ చేశారు.
దిశ,వేలేరు(ధర్మసాగర్): తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్ చేశారు. బుధవారం ధర్మసాగర్, వేలేరు మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తుంటే ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక పోతున్నారని అన్నారు. తెలంగాణ మోడల్ దేశమంతాట కావాలని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని, రేవంత్ రెడ్డి లాంటి రైతు వ్యతిరేకి రైతన్నలకు ఉచిత విద్యుత్ అవసరం లేదని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి వైఖరిని తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. రైతును రాజును చేయాలని సీఎం కేసీఆర్ ముందుకుపోతుంటే రేవంత్ రెడ్డి రైతుల పాలిట రాబందుల మారాడని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి, జడ్పీటీసీ చాడ సరిత, ఆత్మ చైర్మన్ కీర్తి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ ఆంగొతు సంపత్, కో ఆష్షన్ సభ్యులు జానీ, మండల సమన్వయకర్త బిల్లా యాదగిరి, మండల యూత్ అధ్యక్షుడు గోవింద సురేష్, జోగు ప్రసాద్, రైతులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Read More: రైతులపై విషం కక్కిన రేవంత్ రెడ్డిని వదలం: మంత్రి శ్రీనివాస్ గౌడ్