అంతర్రాష్ట్ర ముఠా పనేనా.. ఎస్‌బీఐలో దోపిడీలో ప్రొఫెష‌న‌ల్స్..!

వ‌రంగ‌ల్ జిల్లా చ‌రిత్ర‌లో అత్యంత భారీ దొంగతనం రాయ‌ప‌ర్తిలో న‌మోదైంది.

Update: 2024-11-21 02:48 GMT

వ‌రంగ‌ల్ జిల్లా చ‌రిత్ర‌లో అత్యంత భారీ దొంగతనం రాయ‌ప‌ర్తిలో న‌మోదైంది. వ‌రంగ‌ల్ జిల్లాని రాయ‌ప‌ర్తి మండ‌ల‌కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకులో సోమ‌వారం అర్ధ‌రాత్రి చోరీ జ‌రిగింది. మంగ‌ళ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న వెలుగులోకి రాగా బ్యాంకు లాక‌ర్ల‌ను ధ్వంసం చేసిన దుండ‌గులు ఏకంగా 19.5 కిలోల బంగారు ఆభ‌ర‌ణాలు దోచుకెళ్లారు. ఈ ఆభ‌ర‌ణాల విలువ రూ.13.61 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని బ్యాంకు అధికారులు, పోలీసులు గుర్తించారు. బ్యాంకులో ఖాతాదారులు త‌మ అవ‌స‌రాల నిమిత్తం బంగారు ఆభ‌ర‌ణాల‌ను త‌నఖా పెట్టుకుని రుణాల‌ను తీసుకున్నారు. మొత్తం 497 మంది ఖాతాదారుల‌కు సంబంధించిన బంగారాన్ని దుండుగులు దోచుకెళ్లారు. ప‌క్కా ప్లానింగ్‌, స‌మాచారంతోనే ఈ దొంగ‌త‌నం జ‌రిగిన‌ట్లుగా పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకు దొంగ‌త‌నానికి పాల్ప‌డిన స‌మ‌యంలో దుండ‌గులు అనుస‌రించిన విధానం, క్లూస్ ఏ మాత్రం ల‌భించ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డిన తీరుతో ఇది ప్రొఫెష‌న‌ల్స్ ప‌నే అని అధికారులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) అంబర్‌ కిషోర్‌ ఝా ఎస్‌బీఐ శాఖను సందర్శించి దోపిడీ ఘటన పై ఆరా తీశారు. అంతర్రాష్ట్రాల‌కు చెందిన ముఠా ప‌నే అని న‌మ్ముతూ పోలీసులు విచార‌ణ‌ను వేగిరం చేస్తున్నారు. కాగా, బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల పై బ్యాంక్ అధికారులు ఆరా తీస్తున్నారు. వినియోగదారులు భయపడవద్దని హామీ ఇచ్చారు.

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వ‌రంగ‌ల్ జిల్లా చ‌రిత్ర‌లో అత్యంత భారీ దొంగతనం రాయ‌ప‌ర్తిలో న‌మోదైంది. వ‌రంగ‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తి మండ‌ల‌కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకులో సోమ‌వారం అర్ధ‌రాత్రి చోరీ జ‌రిగింది. మంగ‌ళ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న వెలుగులోకి రాగా బ్యాంకు లాక‌ర్ల‌ను ధ్వంసం చేసిన దుండ‌గులు ఏకంగా 19.5 కిలోల బంగారు ఆభ‌ర‌ణాలు దోచుకెళ్లారు. ఈ ఆభ‌ర‌ణాల విలువ రూ.13.61కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని బ్యాంకు అధికారులు, పోలీసులు గుర్తించారు. బ్యాంకులో ఖాతాదారులు త‌మ అవ‌స‌రాల నిమిత్తం బంగారు ఆభ‌ర‌ణాల‌ను త‌నఖా పెట్టుకుని రుణాల‌ను తీసుకున్నారు. మొత్తం 497 మంది ఖాతాదారుల‌కు సంబంధించిన బంగారాన్ని దుండుగులు దోచుకెళ్లారు. ప‌క్కా ప్లానింగ్‌, స‌మాచారంతోనే ఈ దొంగ‌త‌నం జ‌రిగిన‌ట్లుగా పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకు దొంగ‌త‌నానికి పాల్ప‌డిన స‌మ‌యంలో దుండ‌గులు అనుస‌రించిన విధానం, క్లూలు ఏమాత్రం ల‌భించ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డిన తీరుతో ఇది ప్రొఫెష‌న‌ల్స్ ప‌నే అని అధికారులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

గ్యాస్ క‌ట్ట‌ర్లతో లాక‌ర్ల ధ్వంసం !

గ్యాస్ కట్టర్ సాయంతో బ్యాంక్ వెనుక తలుపులు కోసి దొంగలు బ్యాంకులోకి చొరబడ్డారు. లోప‌లికి ప్ర‌వేశించిన దుండ‌గులు ముందుగా బ్యాంకు సీసీ కెమెరాల‌ను ప‌గుల‌గొట్టారు. గ్యాస్ క‌ట్ట‌ర్ల‌తో బ్యాంకు లాక‌ర్ల‌ను ధ్వంసం చేశారు. బ్యాంకులో మొత్తం మూడు లాక‌ర్లు ఉండ‌గా రెండు బంగారు ఆభ‌ర‌ణాల‌ను దాచ‌డానికి ఒక‌దాంట్లో క్యాష్‌ను నిల్వ చేసుకోవ‌డానికి వినియోగిస్తున్న‌ట్లుగా బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఇందులో ఒక లాక‌ర్‌ను మాత్ర‌మే దుండ‌గులు ధ్వంసం చేసి ఆభ‌ర‌ణాల‌ను కాజేయ‌గ‌లిగారు. మ‌రో రెండు లాక‌ర్ల‌ను ధ్వంసం చేసి ఓపెన్ చేయ‌డానికి స‌మ‌యం ప‌డుతుంద‌నే వ‌దిలేశారా అన్న అనుమానాలు పోలీసుల‌ను వెంటాడుతున్నాయి. వెళ్తూ వెళ్తూ సీసీ కెమెరాల డీవీఆర్‌ను సైతం తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో మాత్రం గ్యాంగ్ ఇన్వాల్వ్ అయిన‌ట్లుగా స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని పోలీసులు ప్రాథ‌మికంగా అంచ‌నాకు వ‌చ్చారు. ఇంత ప‌క‌డ్బందీగా ప్రొఫెష‌న‌ల్స్ మాత్ర‌మే ఇలాంటి చోరీలు చేయ‌గ‌ల‌ర‌ని భావిస్తున్నారు.

రంగంలోకి ఐదు టీంలు..! : సీపీ అంబ‌ర్ కిశోర్ ఝా..

రాయపర్తి బ్రాంచ్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో చోరీ జరిగిన తరువాత బుధవారం కూడా విచారణ కొనసాగుతోంది. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) అంబర్‌ కిషోర్‌ ఝా ఎస్‌బీఐ శాఖను సందర్శించి దోపిడీ ఘటన పై ఆరా తీశారు. ప్రొఫెషనల్ గ్యాంగ్ దోపిడీ చర్య అని, వారు తమ సాంకేతికతను ఉపయోగించి అలారం, సీసీ కెమెరాలను నిలిపివేశారని సీపీ తెలిపారు. లాకర్లను ధ్వంసం చేసి బ్యాంకులోని బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారని, దొంగలు చాకచక్యంగా బ్యాంక్‌లోని సీసీటీవీ కెమెరాల డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్)ను దొంగిలించారని అన్నారు. ప‌రారీలో ఉన్న దొంగ‌ల‌ను ప‌ట్టుకునేందుకు ఐదు బృందాలు గాలిస్తున్నాయ‌ని తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రొఫెషనల్ దోపిడీలు జరిగితే వారు కూడా ప్రయత్నిస్తున్నారని అంబర్ కిషోర్ ఝా చెప్పారు. మొత్తంగా అంతర్రాష్ట్రాల‌కు చెందిన ముఠా ప‌నే అని న‌మ్ముతూ పోలీసులు విచార‌ణ‌ను వేగిరం చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా రాయపర్తి ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ బ్యాంకును సందర్శించి బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలపై ఆరా తీస్తున్నారు. వినియోగదారులు భయపడవద్దని, మేము హామీ ఇస్తున్నామని తెలిపారు. దొంగిలించిన బంగారు ఆభరణాల వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని, ఏదైనా కస్టమర్‌కు వారి వస్తువులు అవసరమైతే, అత్యవసర పరిస్థితుల్లో వారు తనఖా పెట్టిన ఆభరణాల విలువలోని మొత్తాన్ని మాత్రమే అందిస్తామని తెలిపారు.


Similar News