సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ ప్రారంభం..
మండలంలో ఈ నెల 6 నుండి 19 వరకు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం నుండి డాటా ఎంట్రీ పనులు చేపట్టినట్లు ఎంపీడీవో భద్రు, ఎంపీవో కిషోర్ తెలిపారు.
దిశ, మంగపేట : మండలంలో ఈ నెల 6 నుండి 19 వరకు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం నుండి డాటా ఎంట్రీ పనులు చేపట్టినట్లు ఎంపీడీవో భద్రు, ఎంపీవో కిషోర్ తెలిపారు. మండలంలోని 14979 కుటుంబాలను సర్వే చేయగా వాటి వివరాలను మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో 30 కంప్యూటర్లు, 30 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు, 10 మంది రిజర్వ్ ఆపరేటర్ల సహాయంతో డాటా ఎంట్రీ చేపడుతున్నట్లు వారు తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30 వరకు పూర్తి స్థాయిలో డాటా ఎంట్రీ చేపట్టి నివేదికలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అందజేయనున్నట్లు ఎంపీడీవో భద్రు, ఎంపీవో కిషోర్ లు తెలిపారు. మండలంలో వంద శాతం సర్వే పూర్తి కాగా లిస్టులో లేని కొత్త కుటుంబాల కోసం సమగ్ర కుటుంబ సర్వే ఆయా పంచాయతీల కార్యదర్శులతో కొనసాగుతుందని తెలిపారు.