Video Viral: మహిళకు సీపీఆర్ చేసి కాపాడిన కానిస్టేబుల్.. నెట్టింట ప్రశంసలు

ఉరి వేసుకున్న మహిళకు సీపీఆర్(CPR) చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్(Constable) పై నెట్టింట ప్రశంసల(Appreciations) వర్షం కురుస్తోంది.

Update: 2024-11-21 06:04 GMT

దిశ, వెబ్ డెస్క్: ఉరి వేసుకున్న మహిళకు సీపీఆర్(CPR) చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్(Constable) పై నెట్టింట ప్రశంసల(Appreciations) వర్షం కురుస్తోంది. ఘటన ప్రకారం మహబూబాబాద్(Mahaboobabad) కి చెందిన ఓ మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి(Committed Suicide) పాల్పడింది. ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకొని ఉరి వేసుకునే ప్రయత్నం చేసింది. దీంతో భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై సమాచారం అందుకున్నకానిస్టేబుల్ రాంబాబు(Constable Rambabu) హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ సృహతప్పి పడిపోయి ఉండటాన్ని గమణించిన కానిస్టేబుల్ ఆమెకు సీపీఆర్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆ మహిళ తిరిగి సంపూర్ణంగా ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది. అనంతరం ఆ మహిళను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు కానిస్టేబుల్ సీపీఆర్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు(Netizens) స్పందిస్తూ.. సకాలంలో స్పందించి, మహిళ ప్రాణాలు కాపాడినందుకు కానిస్టేబుల్ ను ప్రశంసిస్తున్నారు.

Tags:    

Similar News