Pushpa-2: మరో సారి కిమ్స్ ఆసుపత్రికి దిల్ రాజు.. సాయంపై బాలుడి తండ్రితో చర్చ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theatre Stampade) ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Update: 2024-12-25 07:43 GMT

దిశ, వెబ్ డెస్క్: సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theatre Stampade) ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన శ్రీతేజ(Sriteja) అనే బాలుడు కిమ్స్ ఆసుపత్రిలో(Kims Hospital) చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు(TFDC Chairman Dil Raju) ఇవాళ మరోసారి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్నారు. నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind), దర్శకుడు సుకుమార్(Director Sukumar) లతో కలిసి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడ్ని పరామర్శించనున్నారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీయనున్నారు. అనంతరం బాధిత కుటుంబానికి సాయంపై బాలుడి తండ్రి బాస్కర్ తో చర్చించనున్నారు. కాగా ఇప్పటికే అల్లు అర్జున్(Allu Arjun) రూ. 25 లక్షలు ప్రకటించగా.. పుష్ప-2 సినిమా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్(Mytri Movie Makers) బాధిత కుటుంబానికి 50 లక్షలు పరిహారం అందజేశారు. మంగళవారం బాలుడిని పరామర్శించేందుకు వెళ్లిన దిల్ రాజు.. ఘటనపై ముఖ్యమంత్రితో, అల్లు అర్జున్ తో చర్చిస్తానని, శ్రీతేజ తండ్రి భాస్కర్ కు ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని ప్రకటించారు.  

Tags:    

Similar News