CM Revanth Reddy : వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Update: 2024-12-25 07:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : మెదక్ జిల్లా (Medak District)పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఏడుపాయల వనదుర్గ(Vana Durga) అమ్మవారిని దర్శించుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఏడుపాయల వనదుర్గ ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అర్చక బృందం రేవంత్ రెడ్డికి వేదాశీర్వచనం పలికారు. అధికారులు జ్ఞాపికను అందించారు.

అనంతరం ఏడుపాయల వనదుర్గ ఆలయం అభివృద్ధిలో భాగంగా రూ.35 కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, డివైడర్ నిర్మాణం & హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.192 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.52.76 కోట్లతో మెదక్ నియోజకవర్గంలో వివిధ గిరిజన గ్రామాలను కలుపుతూ రోడ్ల నిర్మాణం పనులకు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి, రూ.5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. మెదక్ జిల్లా స్వయం సహాయక మహిళలకు రూ.100 కోట్ల బ్యాంక్ లింకేజీ చెక్ అందచేశారు. అభివృద్ధి పనులకుశంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. 

Tags:    

Similar News