Sandhya Theatre Issue: ‘మా’ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటన

సంధ్య థియేటర్(Sandhya Theatre) ఘటన నేపథ్యంలో ‘మా’ అసోసియేషన్(MAA Association) అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) కీలక ప్రకటన విడుదల చేశారు.

Update: 2024-12-25 07:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్(Sandhya Theatre) ఘటన నేపథ్యంలో ‘మా’ అసోసియేషన్(MAA Association) అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) కీలక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగిందని అన్నారు. హైదరాబాద్‌లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడడానికి అప్పటి సీఎం చెన్నారెడ్డి(Chenna Reddy) ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపారు. ప్రతీ ప్రభుత్వంతో పరిశ్రమ సత్సంబంధాలు నసాగిస్తోందని.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సున్నితమైన విషయాలపై 'మా' సభ్యులు స్పందించొద్దు కీలక రిక్వెస్ట్ చేశారు. సభ్యులు ఎవరికి వారు తమ తమ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేస్తుంది. అలాంటి అంశాలపై స్పందించడం వల్ల సంబంధిత వ్యక్తులకు నష్టం కలిగే అవకాశం ఉందిని.. ఈ విషయంలో 'మా' సభ్యులకు ఐక్యత అవసరం అధ్యక్షుడు మంచు విష్ణు సూచించారు.

Tags:    

Similar News