Aadi Pinisetty: గెట్ రెడీ భయం అనే శబ్దం వస్తోంది.. అంచనాలను పెంచుతున్న ఆది పోస్టర్

టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి(Aadi Pinisetty) 2022లో ‘ది వారియర్’(The Warrior) మూవీలో విలన్‌గా నటించి మెప్పించాడు.

Update: 2024-12-25 14:30 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి(Aadi Pinisetty) 2022లో ‘ది వారియర్’(The Warrior) మూవీలో విలన్‌గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన ప్రస్తుతం ‘శబ్దం’(Sabdham) చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి అరివాజ్‌గన్ వెంకటాచలం(arivazhagan Venkatachalam) దర్శకత్వం వహిస్తున్నారు. 7G ఫిల్మ్స్, రివాంజ(revanza), అల్ఫా బ్యానర్స్‌పై భానుప్రియ(Bhanupriya), శివ నిర్మిస్తున్నారు.

దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా, ‘శబ్దం’ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ క్రిస్మస్(Christmas) కానుకగా విడుదల చేశారు. ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 28న థియేటర్స్‌లో విడుదల కానున్నట్లు ప్రకటించారు. అలాగే ‘‘భయం అనే శబ్దం వస్తుంది. గెట్ రెడీ సౌండ్ థ్రిల్లర్’’ క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఆది పినిశెట్టి పోస్టర్(Poster) ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది.

Tags:    

Similar News