రేపు సీఎం రేవంత్ రెడ్డి తో భేటీకానున్న చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, నిర్మాతలు, డెరెక్టర్లు

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సినీ ప్రముఖులు రేపు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలవనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది.

Update: 2024-12-25 14:27 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సినీ ప్రముఖులు రేపు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలవనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది.ఈ సమావేశం కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. కాగా ఈ సమావేశం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్(Telangana Film Development Corporation Chairman) దిల్ రాజు‘(Dill Raju) నేతృత్వంలో జరగనుండగా.. సీఎంతో.. చిరంజీవి(Chiranjeevi), వెంకటేష్(Venkatesh), అల్లు అరవింద్(Allu Arvind).. పలువురు నిర్మాతలు( producers), దర్శకులు(directors) రానుండగా.. ప్రభుత్వం నుండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా పుష్ప-2(Pushpa-2) సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్ర గాయాలైన బాలుడిని ఈ రోజు ఉదయం టీఎఫ్‌డీసీ(TFDC) చైర్మన్, ప్రోడ్యూసర్ దిల్ రాజు, అల్లు అరవింద్తో పాటు మైత్రి మూవీ మేకర్స్ పరామర్శించారు. అనంతరం బాలుడి కుటుంబానికి రూ. 2 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం నెలకొన్న సమస్యల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించడానికి తాము నిర్ణయించుకున్నామని.. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరామని చెప్పుకొచ్చారు.


Similar News