రామప్పను సందర్శించిన కేంద్ర మంత్రి..

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని ప్రసిద్ధ

Update: 2024-11-21 09:35 GMT

దిశ,ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని ప్రసిద్ధ దేవాలయమైన రామప్ప రామలింగేశ్వర ఆలయాన్ని గురువారం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయమంత్రి నిము బెన్ జయంతిభాయ్ బంబానియా సందర్శించారు. గురువారం ఉదయం రామప్ప ఆలయానికి చేరుకున్న కేంద్ర సహాయ మంత్రికి జిల్లా కలెక్టర్ దివాకర స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం మంత్రికి పోలీసు బలగాలు గౌరవ వందనం స్వీకరించి రామప్ప దేవాలయంలోని రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ,ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం శిల్ప సంపద,ప్రాముఖ్యతను గైడ్లను అడిగి తెలుసుకున్నారు.


Similar News