గుప్తనిధుల కోసం తవ్వి పూడ్చిన గుంతలో ఏముంది....?
బయ్యారం చెరువు కట్టపై గుప్తనిధుల కోసం అనేక సంవత్సరాలుగా గుప్త
దిశ,బయ్యారం : బయ్యారం చెరువు కట్టపై గుప్తనిధుల కోసం అనేక సంవత్సరాలుగా గుప్త నిధుల తవ్వకాల రాయుళ్లు యథేచ్ఛగా కట్టపై తవ్వకాలు చేపడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది రాత్రి సమయంలో కట్టను గుంతల మయంగా చేశారు. బయ్యారం మండలంలోని ఈనెల 15న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం కట్ట మైసమ్మ విగ్రహం వద్ద గత కొంతకాలంగా రెక్కీ నిర్వహించి జెసిబి సహాయంతో మైసమ్మ విగ్రహం తొలగించి, విగ్రహం కింద ఉన్న గుప్త నిధులను తీసుకొని ఆ గుంతను పూడ్చినట్లు ఆనవాళ్లు కనబడుతున్నాయి .దీని వెనుక అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉన్నారా.. లేక గుప్తనిధుల రాయుళ్ల పనేనా ...అని మండలంలో పలువురికి చర్చనీయాంశంగా అంశంగా మారింది.
గుప్తనిధుల వేట కోసం ఈనెల 15న ,రాత్రి 10.40 ప్రాంతంలో దుబ్బగూడెం ,సీతం పేట గ్రామ రోడ్డులోని నాదెండ్ల వారి పంట పొలాల రోడ్డు పక్కన జేసీబీ వాహనం దాని ముందు బెలెనో బ్లాక్ వాహనం,ఒక తెల్లటి కారు ఆగి ఉండటం అక్కడే వచ్చిన వారు మధ్యం తాగుతూ ఉన్నట్లు , రహదారి వెంట ప్రయాణిస్తున్న వాహన దారులు గమనించినట్లు సమాచారం. ఈ వాహనాలు పోలీసుల విచారణలో సీసీ కెమెరాకు చిక్కినట్లు సమాచారం.
గుప్తనిధుల వేటగాళ్లు పక్కా ప్రణాళికతోనే మైసమ్మ తల్లి విగ్రహం పక్కన ఎత్తైన మట్టి ,రాళ్ల తో కూడిన గట్టును జేసీబీతో తొలగించి కాకతీయుల నాటి గుప్త నిధులను తస్కరించారా.. అనే అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.నిధుల తవ్వకాల సమయంలో మైసమ్మ విగ్రహం నాలుగు మూలల తెల్లటి ఆవాలు వేసి ,తాత్వికుడు తాత్విక పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనపడుతుడటం పలు అనుమానాలకు తావిస్తుంది.తవ్వకాల సమయంలో గుప్త నిధులు,దొరికాయా...లేదా..దొరికిన వారు అక్కడ ఏమైనా బలి ఇచ్చారా... తవ్విన గుంతను పూడ్చారా ...అనే అనుమానాలు మైసమ్మ భక్తుల ,స్థానికులలో అనుమానం బలంగా వినిపిస్తోంది.
గుప్తనిధులు నిందితులు దొరికిన వారు పోలీసులు ట్రేస్ చేసి జేసీబీ ని పట్టుకున్నారా,పట్టుకుంటే అసలు నిందితులను కాపాడేందుకు అధికార ,ప్రతిపక్ష నాయకులు కాపేడేందుకు పోలీసు అధికారులపై వత్తిళ్లు వస్థున్నాయా,అనేది వీడని మిస్టరీ ... పోలీసు అధికారులు నోరు విప్పితేనే.. గుప్త నిధుల రహస్యం వీడేది.చెరువులో చేపల కాపలాకు రోజు చేపల సొసైటీ వారు కాపలా కాస్థుండటం ...వారి కంట పడకుండా...గుప్త నిధుల వేట గాళ్లు వచ్చారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న...నిధుల తవ్వకాల కేసు విచారణకు పోలీసు అధికారులకు రాజకీయ నాయకుల పైరవీలు వారి పనితీరుకు సంకెళ్లు వేశారా..అనే ప్రశ్నలు జనం నుండి ఉత్పన్నం అవుతున్నాయి. 8 శతాబ్దాల చరిత్ర కలిగిన బయ్యారం చెరువు కట్ట మైసమ్మ తల్లి వద్ద గుప్త నిధులను కదిలించిన వారి పై కక్ష కట్టి పతనం చేస్థుందని పలువురు,చర్చించుకుంటున్నారు.
గుంత తవ్విన ప్రాంతంలో ఏదో దుర్వాసన : స్థానికుడు, పూనెం పాపరావు
కట్ట మైసమ్మ విగ్రహం కదిలించి గుప్త నిధుల కోసం వారం రోజుల క్రితం జేసీబీతో గుంతను తవ్వి బంగారు లంకె బిందెలు,తీసుకు పోయినట్లుంది.గుంతలో ఏదో జంతు బలి ఇచ్చినట్లు ఉంది.రోజు జీవాలు తోలుకొని కట్టపై వెళ్లే వాళ్లం ఈ మధ్యలో గుంత తవ్విన ప్రాంతంలో ఏదో దుర్వాసన వస్తున్నట్లు ఉంది.
కట్టపైకి వెళ్లాలంటే భయంగా ఉంది : స్థానికుడు, పూనెం నరసింహారావు
రోజు కట్టపై జీవాలు మేపుతాము,కట్ట మైసమ్మ విగ్రహం ధ్వంసం చేసి ,గుప్తనిధులు తవ్వుకు పోయినట్లు ఉంది.మైసమ్మ తల్లి వారిపై పగ బట్టి చంపుతుంది .ఇలాంటి పని చేయడం కట్టపైకి వెళ్లాలంటే భయంగా ఉంది.దొంగలను పట్టుకుని జైల్లో వేయాలి. ఆ ప్రాంతంలో దేవతను పునః ప్రతిష్టించాలి.