మోదేడ్ గ్రామంలో కార్డెన్ సెర్చ్..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని మోదేడు గ్రామాన్ని సీఐ మహదేవ్ పూర్ రామచందర్ రావు, పలిమెల ఎస్సై తమాషా రెడ్డి గురువారం సందర్శించారు.
దిశ, పలిమెల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని మోదేడు గ్రామాన్ని సీఐ మహదేవ్ పూర్ రామచందర్ రావు, పలిమెల ఎస్సై తమాషా రెడ్డి గురువారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో మహదేవ్ పూర్ సీఐ మాట్లాడుతూ మీరు ఎంత కష్టపడినా పర్వాలేదు కానీ పిల్లల్ని బాగా చదివించాలని, పిల్లల్ని చదువుకు దూరం చేయొద్దని, అలాగే సీజనల్ వ్యాధుల గురించి అప్రమత్తంగా ఉండాలి అని, గ్రామ ప్రజలు ఎవరు కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడవద్దని, చట్ట వ్యతిరేక పనులు చేసేవారికి సహకరించద్దని సూచించారు.
అటవీ జంతువుల కోసం విద్యుత్ తీగలను అమర్చడం కానీ, వాటిని వేటాడటం కానీ చేయొద్దు అని, ఎవరైనా కొత్తగా, అనుమానాస్పదంగా కన్పించినట్లు అయితే వెంటనే మాకు సమాచారం అందించాలి అని తెలిపారు. అలాగే ప్రజలు ఎవరు కూడా మావోయిస్టులకు సహకరించవద్దని, వారి సమాచారం తెలిస్తే వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలని సూచించారు. కొత్తవారు ఎవరు గ్రామంలోకి వచ్చిన పోలీసులకి సమాచారం అందించాలని సూచించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్, టీజీఎస్పి సిబ్బంది పాల్గొన్నారు.