గుంతల మయంగా పర్వతగిరి-వరంగల్ రోడ్లు...
పర్వతగిరి నుంచి జిల్లా కేంద్రం వరంగల్ వరకు ఉన్న ప్రధాన రహదారులు
దిశ,పర్వతగిరి : పర్వతగిరి నుంచి జిల్లా కేంద్రం వరంగల్ వరకు ఉన్న ప్రధాన రహదారులు ఎన్నో నెలల తరబడి గుంతల మయమైన పట్టించుకునే నాధుడే లేదు. ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు అనేకసార్లు ఉప్పరపల్లి క్రాస్ వరకు పర్వతగిరి నుంచి తీగరాజుపల్లి వరకు గుంతలు కనిపించక కిందపడి గాయాలపాలై ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. మండల కేంద్ర నుండి వివిధ గ్రామాలకు వెళ్లే లింక్ రోడ్లు కూడా చాలా అధ్వానంగా తయారయ్యాయి. ఇన్నర్ రోడ్లకు ఇరువైపులా మొక్కలు ఉండడం మూలమలుపులు అధికంగా ఉండటం వర్షాకాలం కావడంతో రోడ్డులకు అటు ఇటు మాబిర,మురికి తుమ్మ మొక్కలు ఏపుగా పెరగడంతో మూల మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకుండా ఉండటం తో అధికంగా యాక్సిడెంట్లు అవుతున్నాయని గత బాధితులు వాపోతున్నారు.
ఈ రహదారుల గుండానే ప్రజా ప్రతినిధులు, అధికారులు నిత్యం ప్రయాణం చేస్తుంటారు. అయినా కూడా రోడ్డు గురించి ఏ ఒక్కరు కూడా పట్టించుకోరు. ఆర్ అండ్ బి అధికారులు మాత్రం ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికోసారి నామమాత్రంగా మట్టి, కంకర డాంబార్ పోసి ప్యాచ్ వర్క్ చేసి వెళ్ళిపోతారు. భారీ వాహనాలు బస్సుల వెళ్ళడం అది మళ్ళీ వారం కాకముందే రోడ్డు గుంతల మయంగా మారి ప్రయాణికులకు, వాహనదారులకు నరకయాతన అవుతుంది.
త్వరలో పనులు మొదలు పెడుతాము : ఆర్ అండ్ బి ఏఈ రత్న శేఖర్
వర్షాకాలం కావడం భారీ వాహనాలు నడవడం వల్ల గుంతలు ఏర్పాటు కంకర తేలడం మా దృష్టికి వచ్చింది. రెండు వైపుల ఇటు ఉప్పరపల్లి అటు తీగరాజుపల్లి రోడ్లను పరిశీలించడం జరిగింది. మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ ను అలెర్ట్ చేశాము. త్వరలో పనులు మొదలుపెడతాము. రోడ్డుకు ఇరువైపులా ఐదు ఫీట్ల వరకు ఉన్న మాబిర మురికి తుమ్మ మొక్కలను తొలగించడానికి డోజర్ ను ఉపయోగిస్తాము.