కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు పక్షపాతి : పాలకుర్తి ఎమ్మెల్యే

గతంలో ఉన్న ప్రభుత్వాల మాదిరిగా కాకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు

Update: 2024-11-11 06:51 GMT

దిశ,పెద్దవంగర : గతంలో ఉన్న ప్రభుత్వాల మాదిరిగా కాకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలుస్తోందని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్వినీ రెడ్డి అన్నారు.సోమవారం మండల కేంద్రంలోని చిన్న వంగర గ్రామంలో ఉన్న వాసవి ఇండస్ట్రీస్ లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పత్తి తేమ 8 శాతం నుంచి 12 శాతం లోపు ఉంటే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర లభిస్తుందని చెప్పారు.

రైతులు నిబంధనలు పాటించాలని కోరారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముద్దసాని సురేష్, ఉపాధ్యక్షులు రంగు మురళి గౌడ్, పీఎసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, తోర్రుర్ మార్కెట్ వైస్ చైర్మన్ భట్టు నాయక్, డైరెక్టర్ లు, వాసవి ఇండస్ట్రీస్ యాజమాన్యం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News