దిశ, ఆత్మకూర్: హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలంలోని నీరుకుల్ల గ్రామంలో గత రెండేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారుడు తాటిపర్తి చలపతిరావును తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు సోమవారం పరామర్శించారు. ఈ సంరద్భంగా నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యమకారుడు చలపతిరావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏ అవసరానికి ఫోన్ చేసినా వెంటనే స్పందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ జాక్ కన్వీనర్ మోటె చిరంజీవి, టీఆర్ఎస్ విద్యా్ర్థి విభాగం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్షం మధుకర్, నీరుకుల్ల ఎంపీటీసీ ఆర్షం వరుణ్ గాంధీ, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మనగాని సాంబమూర్తి, మాజీ సర్పంచ్ వక్కల కుమార్, గ్రామ రైతుబంధు కో-ఆర్డినేటర్ తాటిపర్తి రంగారావు, వెంగేటి ప్రభాకర్, నీరుకుల్ల సొసైటీ డైరెక్టర్ సూరయ్య తదితరులు పాల్గొన్నారు.