వివోఏల సమ్మెకు మద్దతు తెలిపిన ములుగు ఎమ్మెల్యే సీతక్క..

వివోఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గూడూరు మండల వివోఏల కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె నేటికి 28వ రోజుకి చేరుకుంది.

Update: 2023-05-14 14:24 GMT

దిశ, గూడూరు : వివోఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గూడూరు మండల వివోఏల కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె నేటికి 28వ రోజుకి చేరుకుంది. కాగా ఆదివారం వారి సమ్మెకు ములుగు ఎమ్మెల్యే సీతక్క మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివోఏల న్యాయపరమైన సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, ఉద్యోగులకు జీతాల పెంపు, వారికి రెగ్యులర్ అవుతాయని భావించిన వారికి నిరాశ, ఆత్మహత్యలే శరణ్యం అవుతున్నాయని అన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ తరుపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు.

మీ సమస్యలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికాంలోకి వచ్చాక మీ వెన్నంటే ఉండి సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు నునావత్ రాధా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, గూడూరు మండల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ నునావత్ రమేష్, మండల పార్టీ అధ్యక్షులు కత్తి స్వామి, మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి యాకూబ్ పాషా, సొసైటీ వైస్ చైర్మన్ వేం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ యూత్ అధ్యక్షుడు బుడిగే సతీష్, వివోఏ యూనియన్ అధ్యక్షురాలు దారం శ్రీలత, కార్యదర్శి నాన్నబాల పురుషోత్తం, శారద, వసంత, రాజు, పద్మ, సుగుణ, బాలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News