'దిశ ఎఫెక్ట్ '.. 'నరక ప్రయాణం' కథనానికి స్పందన..
మండల కేంద్రంలో నుండి గిర్నిబావి వరకు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించి సైడ్ బర్ములు వేయలేదని (మట్టి), దీంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆదమరచి రోడ్డు దిగితే లోతుగా ఉండటం వలన ప్రమాదాలకు గురవుతున్నారని అక్టోబర్ 20 న దిశ దినపత్రికలో వచ్చిన 'నరక ప్రయాణం' అనే కథనానికి ఆర్ అండ్ బి అధికారులు స్పందించారు.
దిశ, దుగ్గొండి : మండల కేంద్రంలో నుండి గిర్నిబావి వరకు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించి సైడ్ బర్ములు వేయలేదని (మట్టి), దీంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆదమరచి రోడ్డు దిగితే లోతుగా ఉండటం వలన ప్రమాదాలకు గురవుతున్నారని అక్టోబర్ 20 న దిశ దినపత్రికలో వచ్చిన 'నరక ప్రయాణం' అనే కథనానికి ఆర్ అండ్ బి అధికారులు స్పందించారు.
సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా కాంట్రాక్టర్ తో మట్టిపోయించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు సంవత్సరకాలం తరువాత మట్టి వేయటానికి మోక్షం వచ్చిందని చర్చించుకుంటున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు దగ్గరుండి ప్రజల అవసరాలను గుర్తించి చేపట్టిన పనులను అలసత్వం వహించకుండా త్వరితగతిన పూర్తి చేయించాలని కోరుకుంటున్నారు.